దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌సలో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 115 పారుుంట్లతో టాప్‌లో ఉండగా... పాకిస్తాన్ (111), ఆస్ట్రేలియా (108) తర్వాతి స్థానాల్లో ఉన్నారుు. ఇంగ్లండ్ నాలుగో ర్యాంక్‌లో ఉంది. ఇక బౌలర్ల విభాగంలో అశ్విన్ కూడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 900 పారుుంట్లు ఉండగా... దక్షిణాఫ్రికా పేసర్ స్టెరుున్ 878 పారుుంట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ల విభాగంలో కూడా అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాట్స్‌మెన్‌లో రహానే ఒక్కడే (ఆరో ర్యాంక్) భారత్ నుంచి టాప్-10లో ఉన్నాడు. ఈ విభాగంలో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) టాప్‌ర్యాంక్‌లో ఉన్నాడు.