‘ఫిష్‌ బౌల్‌’గా తెలంగాణ | telangana as a fishbowl | Sakshi
Sakshi News home page

‘ఫిష్‌బౌల్‌’గా తెలంగాణ

Published Thu, Oct 13 2016 10:16 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మాట్లాడుతున్న డాక్టర్‌ బండా ప్రకాష్‌ ముదిరాజ్‌ - Sakshi

మాట్లాడుతున్న డాక్టర్‌ బండా ప్రకాష్‌ ముదిరాజ్‌

కాచిగూడ: ప్రభుత్వ సహాయ, సహకారాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ‘ఫిష్‌బౌల్‌’గా తీర్చిదిద్ది దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ నిరంతరం కృషి చేస్తోందని మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ బండా ప్రకాష్‌ ముదిరాజ్‌ అన్నారు. గురువారం నారాయణగూడలోని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహాసభ గౌరవ అధ్యక్షులు రోటం భూపతి, ప్రధానకార్యదర్శి డాక్టర్‌ చొప్పరి శంకర్‌ముదిరాజ్‌లతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4612 వందల ఎకరాల్లోని 88 రిజర్వాయర్లు,  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 19,650 చెరువులు, కుంటల్లో రూ.53 కోట్ల మత్స్య సీడ్స్‌ను పంపిణి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తోందన్నారు.

చత్తీస్‌ఘడ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో పర్యటించి కేజ్‌కల్చర్‌ విధానాన్ని పరిశీలించి ప్రయోగాత్మకంగా తెలంగాణలో ప్రవేశపెట్టారన్నారు. మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉన్న రిజర్వాయర్లు, కుంటలు, చెరువులకు ఉచితంగా చేపలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ అధ్యయన వేదిక చైర్మ ప్రొఫెసర్‌ నీలా రాములు, మహాసభ ప్రతినిధులు పోలు నరేష్, గుర్రాల మల్లేష్, చింతల ప్రకాష్, పల్లెబోయిన అశోక్‌  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement