సాక్షి, విశాఖపట్నం: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. తొలుత న్యూజిలాండ్ 42 ఓవర్లలో 6 వికెట్లకు 269 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (140 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ మూడు, కరణ్ శర్మ రెండు వికెట్లు తీశారు.
అనంతరం భారత్ ‘ఎ’ 42 ఓవర్లలో 9 వికెట్లకు సరిగ్గా 269 పరుగులు సాధించింది. శ్రేయస్ అయ్యర్ (90; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ చేజార్చుకోగా... ఒకదశలో 223 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి పరాజయం అంచులో నిలిచిన భారత్‌ను అంకిత్ బావ్నే (83 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివరి వరకు క్రీజ్‌లో నిలిచి ఓటమిని తప్పించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు.
భారత్ ‘ఎ’, కివీస్ ‘ఎ’ రెండో వన్డే టై
Published Wed, Oct 11 2017 12:10 AM | Last Updated on Wed, Oct 11 2017 12:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment