మరో క్లీప్ స్వీప్పై టీమిండియా గురి | India look to complete clean sweep | Sakshi
Sakshi News home page

మరో క్లీప్ స్వీప్పై టీమిండియా గురి

Published Sat, Jul 18 2015 3:33 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM

మరో క్లీప్ స్వీప్పై టీమిండియా గురి - Sakshi

మరో క్లీప్ స్వీప్పై టీమిండియా గురి

హరారే: జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా మరో క్లీన్ స్వీప్పై గురిపెట్టింది. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్న భారత్.. రెండు టి-20ల సిరీస్లోనూ ఇదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.

ఆదివారం జింబాబ్వేతో జరిగే రెండో టి-20లో రహానే గ్యాంగ్ తలపడుతోంది. జింబాబ్వే పర్యటనలో భారత్కిదే చివరి మ్యాచ్. శుక్రవారం జరిగిన తొలి టి-20లో టీమిండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్లోనూ గెలుపొంది టి-20 సిరీస్నూ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించాలని రహానే సేన పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై సానుకూల పరిస్థితుల్లోనూ జింబాబ్వే విఫలమవుతోంది. జట్టులో ఏ ఇద్దరో ముగ్గురో రాణించడం మినహా సమష్టిగా ఆడలేకపోతోంది. భారత్ విషయానికొస్తే బౌలర్లందరూ సత్తాచాటుతున్నారు. ఇక బ్యాటింగ్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement