కొచ్చి: ఫుట్‌బాల్ ప్రపంచకప్-2018 ఆసియా జోన్ క్వాలిఫయింగ్ పోటీలను భారత జట్టు పరాజయంతో ముగించింది. మంగళవారం తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 1-2 తేడాతో తుర్క్‌మెనిస్తాన్ చేతిలో ఓడింది. దీంతో తమ ‘డి’ గ్రూపులో 3 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. 27వ నిమిషంలో సందేశ్ జింగాన్ హెడర్ గోల్‌తో భారత్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. అయితే ద్వితీయార్ధంలో పుంజుకున్న తుర్క్‌మెనిస్తాన్‌కు అమనోవ్ అర్‌స్లాన్ (49), సెర్డారలీ అటయూ (70) గోల్స్‌తో విజయాన్ని అందించారు.
పరాజయంతో ముగింపు
Published Wed, Mar 30 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM
Advertisement
Advertisement