
భువనేశ్వర్: సొంతగడ్డపై మరోసారి నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తూ వరల్డ్ హాకీ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీతో సోమవారం జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. జర్మనీ తరఫున కెప్టెన్ మార్టిన్ హానెర్ (17వ నిమిషంలో), మాట్స్ గ్రామ్‌బుష్ (20వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో మ్యాచ్‌లో 2–3తో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.
తాజాగా జర్మనీ చేతిలో పరాజయంతో భారత్ ఒక పాయింట్‌తో పూల్ ‘బి’లో చివరిదైన నాలుగో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో పూల్ ‘ఎ’లో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో భారత్ తలపడుతుంది. అర్జెంటీనా–స్పెయిన్; బెల్జియం–నెదర్లాండ్స్ జట్ల మధ్య మంగళవారం లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక పూల్ ‘ఎ’లో ఎవరు ఏ స్థానంలో నిలుస్తారో ఖరారవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment