క్వార్టర్స్‌లో భారత్ మహిళల ఓటమి
వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ
యాంట్‌వార్ప్ : ప్రత్యర్థి ఎదురుదాడులను నిలువరించలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు... వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో సెమీస్ బెర్త్‌ను దూరం చేసుకుంది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ చాంపియన్ నెదర్లాండ్స్ 7-0తో భారత్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. వాన్ యాస్ నోమి (1వ ని.), వెల్టెన్ లిడ్‌వెజ్ (9, 48వ ని.), మస్నేర్ (16వ ని.), గ్లెనెల్లా జెర్గో (18వ ని.), మసక్కెర్ (26, 53వ ని.)లు డచ్‌కు గోల్స్ అందించారు. పక్కా ప్రణాళికతో ఆడిన డచ్ క్రీడాకారిణిలు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఫార్వర్స్, డిఫెండర్లు సమయోచితంగా స్పందించడంతో తొలి నిమిషంలోనే గోల్‌తో షాకిచ్చారు. పెనాల్టీ అవకాశాలను సృష్టించుకుంటూ తొలి క్వార్టర్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచారు. రెండో క్వార్టర్స్‌లోనూ డచ్ ప్లేయర్లు భారత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. స్వల్ప వ్యవధిలో మూడు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 5-0కు పెంచారు. చివరి రెండు క్వార్టర్లలోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి మరో రెండు గోల్స్ సాధించారు.
నెదర్లాండ్స్ గోల్స్ వర్షం
Published Wed, Jul 1 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM
Advertisement
Advertisement