మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 269 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత ఆటగాళ్లో విరాట్ కోహ్లి(72; 82 బంతుల్లో 8 ఫోర్లు), కేఎల్ రాహుల్(48; 64 బంతుల్లో 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా(46; 38 బంతుల్లో 5 ఫోర్లు), ఎంఎస్ ధోని(56 నాటౌట్; 61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు))లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరును సాధించింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ ఆరంభించారు. అయితే భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ(18) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భారత జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఉండగా రోహిత్ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. (ఇక్కడ చదవండి: ఇదేం డీఆర్‌ఎస్‌రా నాయనా!)
భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా కీమర్ రోచ్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతి రోహిత్ బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలోంచి కీపర్ షాయ్ హోప్ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్ అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్ రివ్యూ కోరంగా అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. కాగా, ఇది ఔటా..నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత రాహుల్-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. ఈ జోడి 69 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రాహుల్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. ఆపై విజయ్ శంకర్(14) మూడు ఫోర్లు సాధించి ఊపులో కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు.(ఇక్కడ చదవండి: విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు)
కేదార్ జాదవ్(7) సైతం విఫలమయ్యాడు. కోహ్లి సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు నడిపించాడు. ఎంఎస్ ధోని నుంచి కూడా చక్కటి సహకారం లభించడంతో స్కోరు బోర్డు సాఫీగా ముందుగా సాగింది. ఆ దశలో కోహ్లి ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో హార్దిక్-ధోనిలు మరో మంచి భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 70 పరుగులు జత చేయడంతో భారత్ గాడిలో పడింది. చివరి ఓవర్‌లో ధోని 16 పరుగులు( 2 సిక్సర్లు, 1 ఫోర్) సాధించడంతో పాటు అజేయంగా నిలవడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ మూడు వికెట్లు సాధించగా, కాట్రెల్, జేసన్ హోల్డర్‌లు తలో రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment