భారత్ + జపాన్ | India register second straight win in Junior Asia Cup Hockey | Sakshi
Sakshi News home page

భారత్ + జపాన్

Published Sat, Nov 21 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM

India register second straight win in Junior Asia Cup Hockey

జూనియర్ ఆసియా కప్ తొలి సెమీస్ నేడు
 కాంటమ్ (మలేసియా): లీగ్ దశలో వరుస విజయాలతో హోరెత్తించిన భారత జూనియర్ హాకీ జట్టు... ఆసియా కప్‌లో కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే తొలి సెమీఫైనల్లో జపాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో అన్ని రంగాల్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తుండటంతో కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. దీంతో జపాన్‌పై కూడా ఇదే జోరును కనబర్చాలని ప్రయత్నిస్తున్నారు. లీగ్ తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 2-1తో భారత్ ఓడించడం ఇప్పుడు కలిసొచ్చే అంశం. అలాగే ఆఖరి లీగ్‌లో ఒమన్‌పై 9 గోల్స్ చేయడంతో ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లోకి వచ్చారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 9 గోల్స్ చేసిన డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement