ఇండియన్ ఏసెస్‌కు షాక్ | Indian Aces suffer first defeat of the season in IPTL | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఏసెస్‌కు షాక్

Published Mon, Dec 5 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

ఇండియన్ ఏసెస్‌కు షాక్

ఇండియన్ ఏసెస్‌కు షాక్

ఐపీటీఎల్-2016  
 టోక్యో: వరుసగా రెండు విజ యాలు సాధించి జోరుమీదున్న ఇండియన్ ఏసెస్ జట్టుకు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో తొలి ఓటమి ఎదురైంది. యూఏఈ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ జట్టు 20-30 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. పురుషుల లెజెండ్‌‌స తొలి సింగిల్స్‌లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఏసెస్) 3-6తో థామస్ జొహాన్సన్ చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో మార్టినా హింగిస్ 6-4తో కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌‌స (ఏసెస్)పై నెగ్గింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) జంట 4-6తో పాబ్లో క్యువాస్-హింగిస్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫెలిసియానో లోపెజ్ (ఏసెస్) 3-6తో థామస్ బెర్డిచ్ చేతిలో ఓటమి చవిచూశాడు. 
 
 బోపన్న-లోపెజ్ (ఏసెస్); క్యువాస్-నెస్టర్ జోడీల మధ్య జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్ 6-6తో టైగా ముగిసింది. తొలి దశ పోటీలు ముగిశాక యూఏఈ రాయల్స్, ఇండియన్ ఏసెస్ జట్లు ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. రెండో దశ పోటీలు సింగపూర్‌లో ఈనెల 6 నుంచి 8 వరకు జరుగుతాయి. నాలుగు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్‌లో లీగ్ పోటీలు ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు టైటిల్ కోసం తలపడతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement