Indian aces
-
రన్నరప్ ఇండియన్ ఏసెస్
టైటిల్ నిలబెట్టుకున్నసింగపూర్ స్లామర్స్ ఐపీటీఎల్-2016 సాక్షి, హైదరాబాద్: లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ‘తాన్లా’ ఇండియన్ ఏసెస్ జట్టు కీలక టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచింది. ఫలితంగా అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)-2016 సీజన్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో సింగపూర్ స్లామర్స్ జట్టు 30-14తో ఇండియన్ ఏసెస్‌ను ఓడించి వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలిచింది. టైటిల్ పోరులో ఏసెస్ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం గమనార్హం. ‘తాన్లా’ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరించిన ఇండియన్ ఏసెస్ జట్టు గత ఏడాది కూడా రన్నరప్‌గా నిలిచింది. పురుషుల లెజెండ్స సింగిల్స్ మ్యాచ్‌లో కార్లోస్ మోయా 6-4తో ఫిలిప్పోసిస్ను ఓడించి స్లామర్స్‌కు శుభారంభం అందించాడు. మహిళల సింగిల్స్‌లో సానియా మీర్జా బరిలోకి దిగినా ఏసెస్‌కు ఫలితం లభించలేదు. కికి బెర్టెన్స 6-3తో సానియాను ఓడించి స్లామర్స్ ఖాతాలో మరో విజయాన్ని చేర్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-ఇవాన్ డోడిగ్ (ఏసెస్) ద్వయం 1-6తో బెర్టెన్స-మార్సెలో మెలో జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో కిరియోస్-మెలో (స్లామర్స్) జోడీ 6-2తో డోడిగ్-లోపెజ్ జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో బగ్ధాటిస్ (స్లామర్స్) 6-4తో ఫెలిసియానో లోపెజ్‌ను ఓడించడంతో ఏసెస్ పరాజయం పరిపూర్ణమైంది. -
ఇండియన్ ఏసెస్ జోరు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ ఐదో విజయాన్ని సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ 24-19తో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) జంట 6-5 (7/2)తో బగ్ధాటిస్-బెర్టెన్స (స్లామర్స్) జోడీని ఓడించింది. అంతకుముందు పురుషుల డబుల్స్‌లో డోడిగ్-లోపెజ్ (ఏసెస్) జంట 6-2తో బగ్ధాటిస్-మెలో జోడీపై నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో ఫెలిసియానో లోపెజ్ (ఏసెస్) 6-0తో కిరియోస్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో ఫ్లిప్‌కెన్‌స (ఏసెస్) 2-6తో బెర్టెన్స చేతిలో ఓడిపోరుుంది. పురుషుల లెజెండ్స సింగిల్స్‌లో ఎన్క్విస్ట్ 4-6తో కార్లోస్ మోయా చేతిలో ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం ఏసెస్ 17 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో జపాన్ వారియర్స్ 25-20తో యూఏఈ రాయల్స్‌ను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో సింగపూర్ స్లామర్స్‌తో జపాన్ వారియర్స్; యూఏఈ రాయల్స్‌తో ఇండియన్ ఏసెస్ తలపడతాయి. -
ఇండియన్ ఏసెస్‌ను గెలిపించిన లోపెజ్
సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు నాలుగో విజయం సాధించింది. సింగపూర్ స్లామర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 23-22తో గెలిచింది. ఏసెస్ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్ డబుల్స్‌తోపాటు సింగిల్స్ మ్యాచ్‌లో నెగ్గి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. డబుల్స్‌లో లోపెజ్-డోడిగ్ ద్వయం 6-5 (7/6)తో బగ్ధాటిస్-మెలో జంటపై నెగ్గగా... సింగిల్స్‌లో లోపెజ్ 6-5 (7/4)తో కిరియోస్‌ను ఓడించాడు. అంతకుముందు మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జంట 6-0తో కిరియోస్-బెర్టెన్స జోడీని ఓడించింది. లెజెండ్స సింగిల్స్‌లో ఫిలిప్పోసిస్ (ఏసెస్), మహిళల సింగిల్స్‌లో బెర్టెన్స (ఏసెస్) తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఏసెస్ 14 పారుుంట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ అంచె పోటీలు జరుగుతాయి -
లెక్క సరిచేసిన ఇండియన్ ఏసెస్
యూఏఈ రాయల్స్‌పై గెలుపు ఐపీటీఎల్-2016 సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. మంగళవారం మొదలైన సింగపూర్ అంచె పోటీల్లో ఇండియన్ ఏసెస్ 26-19 పాయింట్ల తేడాతో యూఏఈ రాయల్స్ జట్టును ఓడించింది. మూడు రోజుల క్రితం జపాన్ అంచె పోటీల్లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ 20-30తో యూఏఈ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. తాజా విజయంతో ఏసెస్ జట్టు ఆ ఓటమికి బదులు తీర్చుకుంది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం ఇండియన్ ఏసెస్ 10 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. మహిళల సింగిల్స్‌లో కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌స (ఏసెస్) 6-3తో అనా ఇవనోవిచ్‌ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-సానియా మీర్జా ద్వయం (ఏసెస్) 6-3తో క్యువాస్-మార్టినా హింగిస్ జంటపై గెలిచింది. పురుషుల లెజెండ్స సింగిల్స్‌లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఏసెస్) 6-3తో థామస్ జొహాన్సన్ను ఓడించగా... పురుషుల సింగిల్స్‌లో ఫెలిసియానో లోపెజ్ (ఏసెస్) 2-6తో బెర్డిచ్ చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో డోడిగ్-లోపెజ్ జంట (ఏసెస్) 6-4తో క్యువాస్-నెస్టర్ జోడీపై గెలిచింది. ఫెడరర్, సెరెనా దూరం హైదరాబాద్‌లో ఈనెల 9 నుంచి 11 వరకు జరగాల్సిన చివరి అంచె ఐపీటీఎల్ పోటీలకు స్టార్ క్రీడాకారులు రోజర్ ఫెడరర్, సెరెనా విలియమ్స్ దూరమయ్యారు. ఫెడరర్ పేరు ఏ జట్టులోనూ లేకున్నా... సెరెనా మాత్రం సింగపూర్ స్లామర్స్ తరఫున బరిలోకి దిగాల్సి ఉంది. ‘ఈ ఏడాది సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని అధిగమిస్తానన్న నమ్మకం ఉంది. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఫెడరర్, సెరెనాలకు వివరించాను. గత రెండు సీజన్లలో వీరిద్దరూ ఎంతో సహకరించారు. భవిష్యత్ సీజన్లలో వారు మళ్లీ బరిలోకి దిగుతారని ఆశిస్తున్నాను’ అని ఐపీటీఎల్ వ్యవస్థాపకుడు మహేశ్ భూపతి తెలిపాడు. -
ఇండియన్ ఏసెస్‌కు షాక్
ఐపీటీఎల్-2016 టోక్యో: వరుసగా రెండు విజ యాలు సాధించి జోరుమీదున్న ఇండియన్ ఏసెస్ జట్టుకు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో తొలి ఓటమి ఎదురైంది. యూఏఈ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ జట్టు 20-30 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. పురుషుల లెజెండ్స తొలి సింగిల్స్‌లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఏసెస్) 3-6తో థామస్ జొహాన్సన్ చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో మార్టినా హింగిస్ 6-4తో కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌స (ఏసెస్)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) జంట 4-6తో పాబ్లో క్యువాస్-హింగిస్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫెలిసియానో లోపెజ్ (ఏసెస్) 3-6తో థామస్ బెర్డిచ్ చేతిలో ఓటమి చవిచూశాడు. బోపన్న-లోపెజ్ (ఏసెస్); క్యువాస్-నెస్టర్ జోడీల మధ్య జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్ 6-6తో టైగా ముగిసింది. తొలి దశ పోటీలు ముగిశాక యూఏఈ రాయల్స్, ఇండియన్ ఏసెస్ జట్లు ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. రెండో దశ పోటీలు సింగపూర్‌లో ఈనెల 6 నుంచి 8 వరకు జరుగుతాయి. నాలుగు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్‌లో లీగ్ పోటీలు ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు టైటిల్ కోసం తలపడతాయి. -
ఎదురులేని ఏసెస్
ఐపీటీఎల్-2016 టోక్యో: డిఫెండింగ్ చాంపియన్స్ సింగపూర్ స్లామర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇండియన్ ఏసెస్ విజయం సాధించింది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఏసెస్ 26-25 తేడాతో గట్టెక్కింది. ముందుగా నాలుగు విభాగాల్లో జరిగిన మ్యాచ్‌లు 2-2తో సమం కావడంతో చివరి మహిళల సింగిల్స్ కీలకంగా మారింది. దీంట్లో ఏసెస్ క్రీడాకారిణి కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్సకు గట్టి పోటీ ఎదురైనా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా షూట్‌అవుట్‌లో 6-5తో కికి బెర్టెన్స్‌పై గెలిచి జట్టుకు విజయాన్ని అందించింది. అంతకుముందు పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో స్లామర్స్ ఆటగాడు కార్లోస్ మోయా 6-4తో థామస్ ఎన్క్విస్ట్పై గెలిచారు. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో లోపెజ్ (ఏసెస్) 6-4తో బగ్దాటిస్పై నెగ్గి ఆధిక్యాన్ని సమం చేశాడు. పురుషుల డబుల్స్‌లో కిర్గియోస్-మెలో జోడీ (స్లామర్స్) 6-4తో డోడిగ్-లోపోజ్ జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న (ఏసెస్) ద్వయం 6-4తో మెలో-బెర్టెన్స జోడీపై గెలిచి మ్యాచ్‌లో ఆసక్తి రేపింది. చివర్లో కిర్‌స్టెన్ విశేషంగా రాణించి ఏసెస్‌కు వరుసగా రెండో విజయాన్ని అందించింది. మరో మ్యాచ్‌లో జపాన్ వారియర్స్ 23-20తో యూఏఈ రాయల్స్‌పై గెలిచింది. -
రన్నరప్ ఇండియన్ ఏసెస్
విజేత సింగపూర్ స్లామర్స్ * ఫైనల్లో ఏసెస్‌పై గెలుపు * ఐపీటీఎల్-2 సీజన్ సింగపూర్: లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ఇండియన్ ఏసెస్ జట్టు అంతిమ సమరంలో మాత్రం నిరాశపరిచింది. వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టైటిల్‌ను సాధించాలని ఆశించిన డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం జరిగిన ఐపీటీఎల్-2 సీజన్ ఫైనల్లో ఇండియన్ ఏసెస్ 21-26 గేమ్‌ల తేడాతో సింగపూర్ స్లామర్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు భారత డబుల్స్ ప్లేయర్ పురవ్ రాజా కోచ్‌గా ఉన్న సింగపూర్ స్లామర్స్ జట్టు విజేతగా నిలిచి 10 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 63 లక్షలు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన ఇండియన్ ఏసెస్ జట్టుకు 5 లక్షల డాలర్ల (రూ. 3 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. పురుషుల విభాగంలో డోడిగ్ (ఏసెస్)... మహిళల విభాగంలో బెన్సిచ్ (స్లామర్స్) ‘అత్యంత విలువైన క్రీడాకారుల’ పురస్కారాన్ని అందుకున్నారు. వీరిద్దరికీ 50 వేల డాలర్ల చొప్పున (రూ. 33 లక్షలు) అందజేశారు. లీగ్ దశలో అత్యధిక గేమ్‌లు గెలిచి టాపర్‌గా నిలిచిన ఇండియన్ ఏసెస్‌కు ఫైనల్లో నాదల్ (స్పెయిన్), రద్వాన్‌స్కా (పోలండ్)లాంటి స్టార్ క్రీడాకారులు అందుబాటులో లేకపోవడం విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో కార్లోస్ మోయా (స్లామర్స్) 6-4తో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో బెలిండా బెన్సిచ్ (స్లామర్స్) 6-5తో స్వెత్లానా కుజ్నెత్సోవా (ఏసెస్)పై గెలిచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-సానియా మీర్జా (ఏసెస్) ద్వయం 6-2తో బ్రౌన్-ప్లిస్కోవా (స్లామర్స్) జంటను ఓడించింది. దాంతో ఏసెస్ జట్టు ఓవరాల్‌గా 15-14తో ఒక్క గేమ్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకా (స్లామర్స్) 6-3తో టామిక్ (ఏసెస్)ను ఓడించాడు. దాంతో సింగపూర్ జట్టు 20-18తో రెండు గేమ్‌ల ఆధిక్యాన్ని సంపాదించింది. నిర్ణాయక పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో వావ్రింకా-మెలో (స్లామర్స్) జంట 6-3తో బోపన్న-డోడిగ్ (ఏసెస్) జోడీని ఓడించడంతో సింగపూర్ ఓవరాల్‌గా 26-21తో విజయం సాధించింది. -
ఎదురులేని ఏసెస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ఎదురులేకుండా దూసుకుపోతోంది. భారత్ అంచె పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 26-21తో జపాన్ వారియర్స్‌పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న జంట 6-4తో హెర్బట్-బరోని జోడీపై గెలవగా, మహిళల సింగిల్స్‌లో రద్వాన్‌స్కా 6-2తో కురుమి నారాను ఓడించింది. అయితే పురుషుల డబుల్స్‌లో జపాన్ వారియర్స్ జోడి లియాండర్ పేస్-హెర్బట్ 6-5 (7/6)తో బోపన్న-డోడిగ్ (ఏసెస్)పై విజయం సాధించింది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-3తో థామస్ ఎన్క్విస్ట్ (జపాన్)ను చిత్తు చేయగా, పురుషుల సింగిల్స్‌లో హెర్బట్ (జపాన్) 6-3తో ఇవాన్ డోడిగ్ (ఏసెస్)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ 30-22తో ఫిలిప్పీన్ మావెరిక్స్ గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూఈఏ రాయల్స్‌తో ఇండియన్ ఏసెస్ తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో నాదల్ (ఏసెస్)తో ఫెడరర్ (యూఏఈ రాయల్స్) ఆడే అవకాశముంది. -
ఇండియన్ ‘ఏసెస్' హవా
ఫిలిప్పీన్స్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు దూసుకెళ్తోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 24-15తో మనీలా మావెరిక్స్పై నెగ్గి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో ఫ్యాబ్రిక్ సంటారో 6-1తో డానియెల్ నెస్టర్పై నెగ్గాడు. అయితే పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో ఏసెస్‌కు చుక్కెదురైంది. సింగిల్స్‌లో మోన్ఫిల్స్ 1-6తో ఆండీ ముర్రే చేతిలో ఓడగా... డబుల్స్‌లో బోపన్న-మోన్ఫిల్స్ ద్వయం 0-6తో సోంగా-ట్రీట్ హుయే చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్‌లో హైదరాబాదీ సానియా మీర్జా-బోపన్న జోడీ 6-1తో ముర్రే-షరపోవా జంటపై నెగ్గడంతో పాయింట్ల పరంగా ఏసెస్‌కు కలిసొచ్చింది. చివర్లో జరిగిన మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-3తో షరపోవాపై నెగ్గి ఏసెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని అందించింది. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 28-22తో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది. -
నేటి నుంచి ఐపీటీఎల్
మనీలా (ఫిలిప్పిన్స్): అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (ఐపీటీఎల్)కు రంగం సిద్ధమైంది. మనీలాలో ఇండియన్ ఏసెస్, సింగపూర్ స్లామర్స్ల మధ్య నేడు జరిగే మ్యాచ్‌తో లీగ్‌కు తెర లేవనుంది. భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టులో ఫెడరర్‌తో పాటు సానియా మీర్జా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అయితే తొలి అంచె పోటీల్లో ఫెడరర్ పాల్గొనడం లేదు.