ఇండియన్ ‘ఏసెస్' హవా | IPTL: Sania Mirza, Rohan Bopanna Give Indian Aces 2nd Consecutive Win | Sakshi
Sakshi News home page

ఇండియన్ ‘ఏసెస్' హవా

Published Sun, Nov 30 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

ఇండియన్ ‘ఏసెస్' హవా

ఇండియన్ ‘ఏసెస్' హవా

ఫిలిప్పీన్స్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు దూసుకెళ్తోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 24-15తో మనీలా మావెరిక్స్‌పై నెగ్గి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో ఫ్యాబ్రిక్ సంటారో 6-1తో డానియెల్ నెస్టర్‌పై నెగ్గాడు. అయితే పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో ఏసెస్‌కు చుక్కెదురైంది.

సింగిల్స్‌లో మోన్‌ఫిల్స్ 1-6తో ఆండీ ముర్రే చేతిలో ఓడగా... డబుల్స్‌లో బోపన్న-మోన్‌ఫిల్స్ ద్వయం 0-6తో సోంగా-ట్రీట్ హుయే చేతిలో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో హైదరాబాదీ సానియా మీర్జా-బోపన్న జోడీ 6-1తో ముర్రే-షరపోవా జంటపై నెగ్గడంతో పాయింట్ల పరంగా ఏసెస్‌కు కలిసొచ్చింది. చివర్లో జరిగిన మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-3తో షరపోవాపై నెగ్గి ఏసెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని అందించింది. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 28-22తో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement