ఇండియన్ ఏసెస్ జోరు | IPTL 2016: Indian Aces Beat Singapore Slammers 24-19 | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఏసెస్ జోరు

Published Sat, Dec 10 2016 1:25 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

ఇండియన్ ఏసెస్ జోరు - Sakshi

ఇండియన్ ఏసెస్ జోరు

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ ఐదో విజయాన్ని సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ 24-19తో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) జంట 6-5 (7/2)తో బగ్ధాటిస్-బెర్‌టెన్‌‌స (స్లామర్స్) జోడీని ఓడించింది. అంతకుముందు పురుషుల డబుల్స్‌లో డోడిగ్-లోపెజ్ (ఏసెస్) జంట 6-2తో బగ్ధాటిస్-మెలో జోడీపై నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో ఫెలిసియానో లోపెజ్ (ఏసెస్) 6-0తో కిరియోస్‌ను ఓడించాడు.
 
 మహిళల సింగిల్స్‌లో ఫ్లిప్‌కెన్‌‌స (ఏసెస్) 2-6తో బెర్‌టెన్‌‌స చేతిలో ఓడిపోరుుంది. పురుషుల లెజెండ్‌‌స సింగిల్స్‌లో ఎన్‌క్విస్ట్ 4-6తో కార్లోస్ మోయా చేతిలో ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం ఏసెస్ 17 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో జపాన్ వారియర్స్ 25-20తో యూఏఈ రాయల్స్‌ను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో సింగపూర్ స్లామర్స్‌తో జపాన్ వారియర్స్; యూఏఈ రాయల్స్‌తో ఇండియన్ ఏసెస్ తలపడతాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement