ఇండియన్ ఏసెస్‌ను గెలిపించిన లోపెజ్ | Indian Aces won on singapore slamers | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఏసెస్‌ను గెలిపించిన లోపెజ్సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు నాలుగో విజయం సాధించింది. సిం

Published Thu, Dec 8 2016 11:48 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

Indian Aces won on singapore slamers

సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు నాలుగో విజయం సాధించింది. సింగపూర్ స్లామర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 23-22తో గెలిచింది. ఏసెస్ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్ డబుల్స్‌తోపాటు సింగిల్స్ మ్యాచ్‌లో నెగ్గి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. డబుల్స్‌లో లోపెజ్-డోడిగ్ ద్వయం 6-5 (7/6)తో బగ్ధాటిస్-మెలో జంటపై నెగ్గగా... సింగిల్స్‌లో లోపెజ్ 6-5 (7/4)తో కిరియోస్‌ను ఓడించాడు. అంతకుముందు మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జంట 6-0తో కిరియోస్-బెర్‌టెన్‌‌స జోడీని ఓడించింది. లెజెండ్‌‌స సింగిల్స్‌లో ఫిలిప్పోసిస్ (ఏసెస్), మహిళల సింగిల్స్‌లో బెర్‌టెన్‌‌స (ఏసెస్) తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఏసెస్ 14 పారుుంట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ అంచె పోటీలు జరుగుతాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement