ఏసెస్‌కు మరో పరాజయం | Indian Aces Thrash UAE Royals 30-11 in International Premier Tennis League | Sakshi
Sakshi News home page

ఏసెస్‌కు మరో పరాజయం

Published Fri, Dec 5 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

ఏసెస్‌కు మరో పరాజయం

ఏసెస్‌కు మరో పరాజయం

 సింగపూర్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో ఇండియన్ ఏసెస్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురయింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 20-25 స్వల్ప తేడాతో మనీలా మావెరిక్స్ చేతిలో ఓడింది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో పియోలిన్ (ఏసెస్) 4-6తో ఫిలిప్పోసిస్ చేతిలో ఓడాడు.
 
 మహిళల సింగిల్స్‌లో ఇవనోవిచ్ 6-2తో కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్‌ను ఓడించినా... మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న, సానియా (ఏసెస్) ఓడారు. పురుషుల డబుల్స్‌లోనూ బోపన్న, మోన్‌ఫిల్స్ 2-6తో హుయే, సోంగా చేతిలో మట్టికరిచారు. పురుషుల సింగిల్స్‌లో మోన్‌ఫిల్స్ 6-5తో సోంగాను ఓడించాడు. మరో మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ 27-25తో యూఏఈ రాయల్స్‌పై గెలిచింది.  రేపటి (శనివారం) నుంచి ఐపీటీఎల్ ఢిల్లీలో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement