భజరంగ్‌కు రజతం | Indian grapplers bag two medals in Asian Wrestling Championship | Sakshi
Sakshi News home page

భజరంగ్‌కు రజతం

Published Fri, Apr 25 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM

Indian grapplers bag two medals in Asian Wrestling Championship

ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్
 న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు రెండు పతకాలతో మెరిశారు. గురువారం జరిగిన పురుషుల 61 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో భజరంగ్ 0-11తో మసూద్ ఎస్మెలీపోర్ (ఇరాన్) చేతిలో ఓడాడు. తద్వారా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.
 
  97 కేజీల కేటగిరీలో సత్యవ్రత్ కడియాన్ 5-5తో అలియాన్ జుమేవ్ (కజకిస్థాన్)పై రెప్‌చేజ్‌లో నెగ్గి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 70 కేజీల కాంస్య పతక పోరులో అమిత్ కుమార్ డాకర్ 3-6తో కెన్ హోసాకా (జపాన్) చేతిలో; 74 కేజీల క్వార్టర్స్‌లో ప్రవీణ్ రాణా 9-10తో ఇంకోనెటివ్ (కిర్గిస్థాన్) చేతిలో ఓడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement