మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత స్టార్ హాకీ ఆటగాడు, మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. తాను శాస్వతంగా ఆట నుంచి వైదొలుగుతున్నానని బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఏషియన్ గేమ్స్‌లో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. భారీ ఆశల నడుమ ఏషియన్ గేమ్స్‌లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్‌కు చేరకపోవటం సర్దార్‌ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది.
తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఇన్నాళ్ల తన ప్రయాణంలో హాకీని ఎంతో ఆస్వాధించానని.. జట్టు నుంచి వైదొలగడానికి తనకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. 32 ఏళ్ల సర్దార్ సింగ్ భారత్‌కు 350 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2008-16 మధ్యలో ఎనిమిదేళ్లు భారత జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించాడు. ఇతని నాయకత్వంలోనే 2008లో సుల్తాన్ అజ్లాన్ షా కప్‌ను భారత్ సొంతం చేసుకుంది. భారత హాకీ జట్టుకు సర్ధార్ చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2012లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ అవార్డులతో గౌరవించింది. అంతే కాకుండా సర్దార్ నాయకత్వంలోనే భారత్ రెండు సార్లు ఒలంపిక్స్‌లో పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment