సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సెపక్‌తక్రా ప్రపంచకప్ టోర్నీలో భారత పురుషుల జట్టు రాణించింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. టైటిల్ పోరులో థాయ్‌లాండ్ 21–19, 23–21తో మలేసియాపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీ సెమీఫైనల్లో ఓడిన భారత్ కాంస్యాన్ని దక్కించుకుంది. సెమీస్‌లో రన్నరప్ మలేసియా చేతిలో భారత్ పరాజయం పాలైంది. మరో సెమీస్‌లో ఓడిన సింగపూర్ జట్టుకు కూడా కాంస్యం లభించింది.
మహిళల టీమ్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ థాయ్‌లాండ్ 21–11, 23–19తో వియత్నాంపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత మహిళల జట్టు క్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్‌బాబు, ఓఎస్డీ రాజేశ్వర్, అంతర్జాతీయ సెపక్‌తక్రా సమాఖ్య ప్రతినిధులు, భారత సెపక్‌తక్రా సమాఖ్య కార్యదర్శి యోగిందర్ సింగ్ దహియా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment