బెంగళూరు: టి-20 ప్రపంచ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. 3 పరుగుల తేడాతో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ అవుటయ్యారు. బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.
భారత ఓపెనర్లు రోహిత్ (18), ధవన్ (23) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 42 పరుగులు జోడించారు. అయితే ఈ స్కోరు వద్ద రోహిత్ పెవిలియన్ చేరాడు. బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఓవర్లో రోహిత్ క్యాచవుటయ్యాడు. ఆ వెంటనే ధవన్.. షకీబల్ హసన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో భారత్ పరుగుల జోరు కాస్త తగ్గింది. విరాట్ కోహ్లీ, రైనా బ్యాటింగ్ చేస్తున్నారు.
3 పరుగుల తేడాతో ఓపెనర్లు అవుట్
Published Wed, Mar 23 2016 8:15 PM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM
Advertisement
Advertisement