భారత షూటర్లు విఫలం | Indian shooters fail | Sakshi
Sakshi News home page

భారత షూటర్లు విఫలం

Mar 21 2017 11:53 PM | Updated on Sep 5 2017 6:42 AM

ప్రపంచకప్‌ షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది.

అకాపుల్కో (మెక్సికో): ప్రపంచకప్‌ షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. ట్రాప్‌ ఈవెంట్‌లో పోటీపడిన భారత క్రీడాకారులు జొరావర్‌ సింగ్, కైనన్‌ షెనాయ్, బీరేన్‌దీప్‌ సోధి ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యారు.

క్వాలిఫయింగ్‌లో జొరావర్‌ 121 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో... హైదరాబాదీ షూటర్‌ కైనన్‌ షెనాయ్‌ 120 పాయింట్లతో 16వ స్థానంలో... బీరేన్‌దీప్‌ 112 పాయింట్లతో 53వ స్థానంలో నిలిచారు. బుధవారం జరిగే డబుల్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు షపథ్‌ భరద్వాజ్, అంకుర్‌ మిట్టల్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 

Advertisement

పోల్

Advertisement