అశ్విన్కు రెస్ట్.. రోహిత్ అవుట్ | Indian Team announced for first three ODIs against West Indies | Sakshi
Sakshi News home page

అశ్విన్కు రెస్ట్.. రోహిత్ అవుట్

Published Sat, Oct 4 2014 4:07 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

అశ్విన్కు రెస్ట్.. రోహిత్ అవుట్

అశ్విన్కు రెస్ట్.. రోహిత్ అవుట్

ముంబై: వెస్టిండీస్తో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 14 మందితో కూడిన జట్టును శనివారం ప్రకటించారు.

ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు విశ్రాంతినివ్వగా, గాయం కారణంగా రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. రోహిత్ స్థానంలో మురళీ విజయ్ను జట్టులోకి తీసుకున్నారు. కొత్త ముఖం కుల్దీప్ యాదవ్కు తొలిసారి అవకాశమిచ్చారు. తెలుగుతేజం అంబటి రాయుడు జట్టులో స్థానం నిలబెట్టుకున్నాడు. ఈ నెల 8 నుంచి సిరీస్ జరగనుంది.

జట్టు: ధోనీ, ధావన్, రహానె, అంబటి రాయుడు, కోహ్లీ, రైనా, జడేజా, అమిత్ మిశ్రా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, ఉమేష్, మురళీ విజయ్, మోహిత్ శర్మ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement