సాక్షి, హైదరాబాద్: సెపక్‌తక్రా ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తొలిరోజు భారత జట్లు సత్తా చాటాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. గురువారం జరిగిన పురుషుల మ్యాచ్‌లో భారత్ 21–6, 21–10తో ఫ్రాన్స్ జట్టును చిత్తుగా ఓడించింది. మహిళల విభాగంలో భారత్ 21–8, 21–8తో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్‌లో తొలిసారి జరుగుతోన్న ఈ ప్రపంచకప్‌కు భాగ్యనగరం ఆతిథ్యమిస్తోంది.
రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి ఈ మెగా టోర్నీని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌ఆర్ ప్రేమ్‌రాజ్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కె. సాయిబాబా, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె. రంగారావు, అంతర్జాతీయ సెపక్‌తక్రా సమాఖ్య కార్యదర్శి అబ్దుల్ హలీం ఖాదర్, డిప్యూటీ ప్రెసిడెంట్ బూన్‌చెయ్ లోరిపట్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ తౌఫీఖ్, భారత సెపక్‌తక్రా సమాఖ్య కార్యదర్శి యోగిందర్ సింగ్ దహియా తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నీలో మొత్తం 16 పురుషుల జట్లు, 12 మహిళల జట్లు పాల్గొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment