భారత పర్యటనకు క్రిస్ గేల్ దూరం!
అంటిగువా: భారత పర్యటనకు డాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ దూరమయ్యాడు. గాయం కారణంగా వెస్టిండీస్ జట్టు నుంచి క్రిస్ గేల్ తప్పుకున్నాడు. వచ్చెనెలలో భారత్ లో పర్యటించే వెస్టిండీస్ జట్టు ఎంపిక జరిగింది. భారత్ లో అక్టోబర్ 8న ప్రారంభమయ్యే వెస్టిండీస్ జట్టుకు డ్వేన్ బ్రావో కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
మార్లన్ శ్యామ్యుల్, డ్వేన్ స్మిత్,జెరోమ్ టేలర్ లు జట్టులోకి వచ్చారు. గత సంవత్సరం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు శ్యామ్యూల్, స్మిత్ లు దూరంగా ఉన్నారు. గాయం కారణంగా టేలర్ గత నాలుగు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్నారు.