వింబుల్డన్ టోర్నీకి షరపోవా దూరం
లండన్: రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా వచ్చే నెలలో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు దూరమైంది. తొడ గాయం కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. 2004లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన షరపోవా... సరైన ర్యాంక్ లేని కారణంగా ఈసారి వింబుల్డన్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో చోటు కోసం క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. ‘రోమ్ ఓపెన్ టోర్నీ సందర్భంగా తొడకు గాయమైంది. స్కాన్ చేస్తే ఆ గాయం ఇంకా తగ్గలేదని తేలింది.
దాంతో ముందు జాగ్రత్తగా మొత్తం గ్రాస్‌కోర్టు సీజన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 30 ఏళ్ల షరపోవా తెలిపింది. గతేడాది డోపింగ్‌లో పట్టుబడినందుకు షరపోవాపై 15 నెలల నిషేధం విధించారు. నిషేధం గడువు పూర్తయ్యాక ఏప్రిల్ చివరి వారంలో స్టట్‌గార్ట్ ఓపెన్‌తో ఆమె పునరాగమనం చేసింది. ప్రస్తుతం 178వ ర్యాంక్‌లో ఉన్న షరపోవాకు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 10 వరకు జరిగే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లోనూ మెయిన్ ‘డ్రా’లో నేరుగా చోటు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.