న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఎంతో మంది యువ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తోందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. ఈ లీగ్ కేవలం భారత్‌లో ఉన్న క‍్రికెటర్లకు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లందరికీ ఎంతో సాయపడిందన్నారు. ‘హెచ్‌టీ మింట్ ఆసియా సమిట్’లో పాల్గొన్న సచిన్ పలు అంశాలపై మాట్లాడారు.
‘అంతర్జాతీయ క్రికెట్ మాదిరిగా ఐపీఎల్ కూడా ఎంతో కఠినమైనది, పోటీ తత్వంతో కూడుకున్నది. ఐపీఎల్ భారత ఆటగాళ్లకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్లర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐపీఎల్ ఆడిన అనుభవంతోనే ఇతర దేశాల ఆటగాళ్లు భారత పర్యటనకు వస్తున్నారు. ఐపీఎల్ భారత క్రికెట్‌కే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంతో ఇచ్చింది’ అని సచిన్ అన్నారు. మరొకవైపు ఒత్తిడి ఎదుర్కోవడం గురించి మాట్లాడిన సచిన్.. దాని వల్ల కొన్ని సందర్భాల్లో ఉత్తమ ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అందుచేత ఒత్తిడికి కూడా మంచిదేనని సచిన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment