
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్...! సంక్షిప్తంగా ‘ఐపీఎల్’...! ఇది గూగుల్‌లో అత్యధికులు వెతికిన పదంగా ఓ అధ్యయనంలో తేలింది. 18 లక్షల మంది దీనికోసం అన్వేషిం చారని సెర్చింజన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ సెమ్ రష్ ప్రకటించింది. ఈ సంఖ్య 2017 ఏప్రిల్‌లో 8.23 లక్షలు ఉండగా ఏడాది వ్యవధిలోనే రెట్టింపు కావడం గమనార్హం.
ఐపీఎల్‌కు 22 లక్షల 52 వేల రిలేటెడ్ కీ వర్డ్స్ కూడా ఉన్నట్లు సెమ రష్ పేర్కొంది. మా ర్కెటింగ్ వ్యూహాలు, వ్యాపార ఎత్తుగడల కారణంగానే ఇది సాధ్యమైందని వివరించింది.