
ఇషాన్ కిషాన్
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషాన్ రెచ్చిపోయాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 14 ఓవర్‌లో వరుస బంతుల్లో నాలుగు సిక్సులు బాది చుక్కులు చూపించాడు. దీంతో ఇషాన్ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్‌లో వేగవంతమైన అర్థ సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక అంతకముందు కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ నమోదు చేయగా.. కోల్‌కతా ఆటగాడు సునీల్ నరైన్ 17 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఈ ఘనతతో ఇషాన్ ఐపీఎల్ చరిత్రలో పదో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment