
క్రికెటర్లు డబ్బుకే ప్రాముఖ్యతిస్తున్నారు..
బెర్లిన్: టి20 క్రికెట్ లీగ్‌ల రాకతో ఆటగాళ్ల దృక్పథంలో గణనీయ మార్పు కనిపిస్తోందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా తెలిపారు. ఇందులో ఎక్కువ డబ్బు కనిపిస్తుండడంతో జాతీయ జట్లకు ఆడడం కన్నా లీగ్‌ల్లో ఆడేందుకే వారు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా ఆయా జట్లు తమ మూడు ఫార్మాట్లలో సమతూకాన్ని సాధించలేకపోతున్నాయని అన్నారు.
అయితే భారత్, ఆసీస్, ఇంగ్లండ్ జట్లకు ఈ సమస్య పెద్దగా లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టి20 క్రికెట్‌ను అటకెక్కించాల్సిన అవసరం ఉందని అన్నారు. టెస్టు క్రికెట్టే నంబర్‌వన్ అని స్పష్టం చేశారు. తమ దేశంలో టెస్టులకు కూడా స్టేడియాలు నిండుతాయని గుర్తుచేశారు.