జ్వాలను ‘టాప్’లో చేర్చండి! | jawala gutta | Sakshi
Sakshi News home page

జ్వాలను ‘టాప్’లో చేర్చండి!

Published Sat, Jul 4 2015 12:46 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM

జ్వాలను ‘టాప్’లో చేర్చండి! - Sakshi

జ్వాలను ‘టాప్’లో చేర్చండి!

ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి
 సాక్షి, హైదరాబాద్: టార్గెట్ ఒలింపిక్ పోడి యం (టాప్) పథకంలో గుత్తా జ్వాలకు చోటు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదికి ప్రత్యేక లేఖ రాశారు. జ్వాలతో పాటు ఆమె డబుల్స్ భాగస్వామి అశ్విని పొన్నప్పలకు ‘టాప్’ ద్వారా ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరారు. ఇటీవల కెనడా ఓపెన్ టైటిల్ నెగ్గిన జ్వాల, శుక్రవారం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి తమకు అండగా నిలవాలని అభ్యర్థించింది.
 
 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం మొదలు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు, ఇతర ఘనతల గురించి ప్రధానికి రాసిన లేఖలో సీఎం ప్రస్తావించారు. సంబంధిత అధికారులకు తగు సూచనలివ్వాలని విజ్ఞప్తి చేసిన కేసీఆర్, భారత్ తరఫున ఒలింపిక్ పతకం సాధించే సామర్థ్యం జ్వాల-అశ్విని జోడీకి ఉన్నట్లు తాను విశ్వసిస్తున్నానన్నారు. అంతకు ముందు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావు కూడా జ్వాలను అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement