
న్యూఢిల్లీ: ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఫ్రాన్స్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఆరో సీడ్ కశ్యప్ 21–15, 21–17తో రొసారియో (ఇటలీ)పై గెలి చాడు. హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ 18–21, 17–21తో అజయ్ జయరామ్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, గుమ్మడి వృశాలి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.
శ్రీకృష్ణప్రియ 16– 21, 22–20, 13–21తో ముగ్ధ (భారత్) చేతిలో... వృశాలి 11–21, 12–21తో పొలికర్పోవా (ఇజ్రాయెల్) చేతిలో ఓడారు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో మిథున్ 21–18, 21–16తో సిద్ధార్థ్‌పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. నికొలోవ్ (బల్గేరియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సిరిల్ వర్మ తొలి గేమ్‌ను 22–20తో నెగ్గి, రెండో గేమ్‌ను 14–21తో కోల్పోయాడు. మూడో గేమ్‌లో 3–14తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు.
Comments
Please login to add a commentAdd a comment