
కౌశల్ బౌలింగ్ సందేహాస్పదం!
కొలంబో: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన నివేదికను లంక మేనేజ్‌మెంట్‌కు అందజేశారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘కౌశల్ బౌలింగ్ శైలిని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఐసీసీ నిబంధనలకు లోబడి అతను బౌలింగ్ చేయడం లేదు. కాబట్టి 14 రోజుల్లో అతని శైలిని సరి చేసుకోవాలి. అయితే పరీక్ష ఫలితాలు వచ్చే వరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయొచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. బౌలింగ్ శైలిని సరిదిద్దుకోవడానికి కౌశల్ త్వరలోనే చెన్నైకి రానున్నాడు.