ఒలింపిక్స్‌లో శ్రీకాంత్ ముందంజ
రియో: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాండి శ్రీకాంత్ రియో ఒలింపిక్స్‌లో మరో విజయం సాధించాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్ క్రీడాకారుడు జాన్ జోర్గెన్‌సన్‌పై విజయం సాధించిన శ్రీకాంత్.. క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. రెండు వరుస సెట్లను శ్రీకాంత్ 21-19, 21-19 తేడాతో గెలుచుకున్నాడు. తొలిరౌండ్‌లో ఆది నుంచి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయిన శ్రీకాంత్.. రెండో రౌండ్‌లో తొలుత వెనుకబడినా తరువాత పుంజుకొని విజయం సాధించాడు.
భారత క్రీడాకారులు ఒక్కొక్కరుగా ఒలింపిక్స్ నుంచి నిరాశగా వెనుదిరుగుతున్న తరుణంతో శ్రీకాంత్ పతకంపై ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారుడు లిన్ డాన్‌తో శ్రీకాంత్ తలపడతాడు.