కేఎల్‌ రాహుల్‌కి బెన్‌ స్టోక్స్‌ సాయం.. | KL Rahul loses his shoe, Ben Stokes helps him put it back on | Sakshi
Sakshi News home page

కేఎల్‌ రాహుల్‌కి బెన్‌ స్టోక్స్‌ సాయం..

Published Tue, Sep 11 2018 1:51 PM | Last Updated on Tue, Sep 11 2018 6:15 PM

KL Rahul loses his shoe, Ben Stokes helps him put it back on - Sakshi

లండన్‌:  ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్ పేరు చెబితే ఆటతోపాటు వివాదాలే గుర్తొస్తాయి. ఏడాది క్రితం బ్రిస్టర్‌ బార్‌ ముందు పడిన గొడవ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అప్పటి నుంచి స్టోక్స్‌ అంటేనే కాస్త జాగ్రత్తగా చూస్తున్నారంతా. కానీ టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టు సందర్భంగా స్టోక్స్‌ క్రీడా స్ఫూర్తి చాటాడు.

ఓవల్‌ టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ సమయంలో కేఎల్‌ రాహుల్‌కు స్టోక్స్‌ సాయం చేసి తనలో ఓ జెంటిల్‌మన్‌ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో డిఫెన్స్‌ ఆడిన రాహుల్‌ పరుగు కోసం ప్రయత్నించాడు. పరుగెత్తే క్రమంలో అతడి పాదానికి ఉన్న షూ ఊడిపోయింది. దీంతో రాహుల్‌ ఒక కాలికి షూ లేకుండానే రన్నింగ్‌ చేశాడు. బౌలింగ్‌ చేసి తిరిగి బౌలర్‌ ఎండ్‌కు వెళ్తున్న స్టోక్స్‌...షూ కింద పడిపోవడం చూసి వెనక్కి వెళ్లాడు.

షూ తీసుకొని లేస్‌ సరిచేసి రాహుల్‌ చేతికి అందించాడు. బెన్‌ స్టోక్స్‌ చేసిన పనికి రాహుల్‌ మాత్రమే కాకుండా క్రికెట్‌ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఐదో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఇంగ్లండ్‌ బౌలర్లు విజృంభించి బౌలింగ్‌ చేయడంతో ఆఖరి రోజు భారత బ్యాట్స్‌మన్‌ అసాధారణంగా పోరాడ్సిలిందే. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(1), చతేశ్వర పుజారా(0), విరాట్‌ కోహ్లి(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు.

ఓటమి అంచున!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement