న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, భార్య అనుష్క శర్మలకు ఏ చిన్నపాటి విరామం దొరికినా దాన్ని విహార యాత్రకు కేటాయిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భూటాన్‌లో విహార యాత్రకు వెళ్లిన ఈ జంట.. కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా తన రెండో వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విరాట్ జోడి స్విట్జర్లాండ్‌కు వెళ్లింది. దీనిలో భాగంగా స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాల్లో విరుష్క జోడి చక్కర్లు కొట్టింది. మంచుతో కప్పబడిన ఆ కొండల్లో విరాట్-అనుష్కలు సరదా సరదాగా గడిపారు. వీటికి సంబంధించి ఫొటోలను విరాట్ తన ట్వీటర్ అకౌంట్‌లో షేర్ చేశాడు.
వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్ ముగిసిన తర్వాత విరుష్క జోడి.. స్విట్జర్లాండ్‌ను విహార యాత్రగా పెట్టుకున్నారు. ఇప‍్పుడు అక్కడ ఆహ్లాదంగా గడుపుతున్న ఈ జంట త్వరలోనే భారత్‌కు రానుంది. శ్రీలంకతో, ఆసీస్‌లతో వరుసగా పరిమిత ఓవర్ల సిరీస్ ఉండటంతో కోహ్లి మళ్లీ బిజీ కానున్నాడు. ఇక భారత ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ముంబైలోని జియో వండర్ ల్యాండ్‌ను రోహిత్ తన కుటుంబంతో సందర్శించాడు.
❄️⛷😃 pic.twitter.com/H70Vt6DJNn
— Virat Kohli (@imVkohli) December 28, 2019
Comments
Please login to add a commentAdd a comment