Kohli is on Top Across all Formats, says Shane Warne - Sakshi
Sakshi News home page

‘స్మిత్‌ టెస్టుల్లోనే మేటి.. మరి కోహ్లి అలా కాదు’

Published Fri, Sep 6 2019 11:47 AM | Last Updated on Fri, Sep 6 2019 12:57 PM

Kohli On Top Across formats Warne - Sakshi

మాంచెస్టర్‌:  ప్రపంచ క్రికెట్‌లో అన్ని  ఫార్మాట్ల పరంగా చూస్తే తమ దేశ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ కంటే కూడా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినే గ్రేటెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అని ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు  షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. స్మిత్‌ కేవలం టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే అత్యుత్తమ ఆటగాడని, కోహ్లి మూడు ఫార్మాట్లలో మేటి  అని వార్న్‌ పేర్కొన్నాడు. ఇటీవల కోహ్లి నుంచి నంబర్‌ టెస్టు ర్యాంకును లాగేసుకున్న స్మిత్‌.. టెస్టుల్లో సెంచరీల పరంగా కోహ్లిని దాటేశాడు.

ఈ నేపథ్యంలో వార్న్‌ మాట్లాడుతూ.. ‘ ప్రపంచ క్రికెట్‌లో కోహ్లినే తిరుగులేని ఆటగాడు. మూడు ఫార్మాట్లలో కోహ్లి మార్కు ప్రత్యేకం. అన్ని ఫార్మాట్లలో కోహ్లి పరుగుల వరద పారిస్తాడు. ఇక్కడ స్మిత్‌ కేవలం అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌ మాత్రమే. టెస్టులో ఎవరు అత్యుత్తమం అంటే అప్పుడు స్మిత్‌ పేరును మాత్రమే సూచిస్తా. అలా కాకుండా ఓవరాల్‌గా అడిగితే మాత్రం కోహ్లికే ఓటేస్తా.  కోహ్లి ఒక లెజెండ్‌ క్రికెటర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సచిన్‌ టెండూల్కర్‌ 100 సెంచరీలు రికార్డును కోహ్లినే బ్రేక్‌ చేస్తాడు’ అని వార్న్‌ తెలిపాడు.  పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాను చూసిన గ్రేటెస్ట్‌  ప్లేయర్‌ ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లినేనని పేర్కొన్నాడు. తన దృష్టిలో వివ్‌ రిచర్డ్స్‌ అత్యుత్తమ వన్డే  ఆటగాడైతే, అతన్ని కూడా కోహ్లి అధిగమించాడని ప్రశంసించాడు.(ఇక్కడ చదవండి: కోహ్లిని దాటేశాడు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement