పేస్-బెగెమన్ జంటకు నిరాశ
న్యూఢిల్లీ: షెన్‌జెన్ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్)-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) జంటకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. చైనాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పేస్-బెగెమన్ ద్వయం 6-4, 1-6, 9-11తో గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెరుున్)-మాలిక్ జజిరి (టర్కీ) జోడీ చేతిలో ఓడిపోరుుంది. గంటా 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్ జంట తొలి సెట్‌ను నెగ్గినా, రెండో సెట్‌లో పూర్తిగా తడబడి కేవలం ఒక గేమ్ మాత్రమే గెలిచింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో పేస్ జోడీ కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు చైనాలోనే జరుగుతున్న చెంగ్డూ ఓపెన్ టోర్నీలో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో దివిజ్-పురవ్ జోడీ 6-2, 6-4తో మూడో సీడ్ డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా) ద్వయంపై సంచలన విజయం సాధించింది.