లియాండర్ పేస్
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌కు మళ్లీ డేవిస్ కప్ ఆడే అవకాశం ఇస్తారో లేదో నేడు తేలనుంది. వచ్చే నెల చైనాతో జరిగే పోరు కోసం భారత డేవిస్ జట్టును ఆదివారం ఎంపిక చేయనున్నారు. ఈ సెలక్షన్స్‌లో పేస్ పేరును పరిశీలిస్తామని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వర్గాలు పేర్కొన్నాయి. ‘కెనడాతో జరిగిన డేవిస్ పోరులో డబుల్స్‌లో భారత జోడీ గెలిచి ఉంటే వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించే అవకాశముండేది. అదే లియాండర్ పేస్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది’ అని ఏఐటీఏ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.
అయితే నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి, డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్నలతో పేస్‌కు సఖ్యత లేనపుడు ఇదేలా సాధ్యమని విలేకర్లు ప్రశ్నించగా... ముందు వ్యక్తిగత విబేధాలు పక్కనబెట్టాలని, దేశ ప్రయోజనాలనే చూడాలని సమాధానమిచ్చారు. గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరుకు కూడా పేస్‌ను దూరంగా ఉంచారు. దుబాయ్‌లో జరిగిన ఏటీపీ టోర్నీలో రన్నరప్‌గా నిలవడంతో లియాండర్ పేస్ డబుల్స్ ర్యాంకుల్లో మళ్లీ టాప్–50లోకి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment