
సాక్షి, హైదరాబాద్: వోల్వో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6–4, 6–4తో తక్ కున్ వాంగ్ (ఫ్రాన్స్)పై గెలిచాడు.
ఈ మ్యాచ్‌లో సాకేత్ తొమ్మిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన సాకేత్, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో శశికుమార్ ముకుంద్ 1–6, 6–3, 6–3తో రెండో సీడ్ జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment