
ఫైనల్లో పేస్ జోడి
తాష్కెంట్: భారత టెన్నిస్ వెటరన్ లియాండర్ పేస్ ఈ సీజన్‌లో మూడో ఏటీపీ చాలెంజర్ టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచాడు. గురువారం తాష్కెంట్ చాలెంజర్ టోర్నీ డబుల్స్ సెమీస్‌లో మూడో సీడ్ పేస్, ఆండ్రీ బెగెమాన్ (జర్మనీ) జోడి 6-2, 6-0 తేడాతో సంజార్, జురాబెక్ (తాష్కెంట్)లపై గెలిచింది.
కేవలం 41 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను నెగ్గిన పేస్ జంట ఇప్పటికే బియెల్లా ఈవెంట్ నెగ్గగా తన మరో సహచరుడితో పేస్ బుసాన్ టోర్నీ టైటిల్‌ను అందుకున్నాడు.