రన్నరప్ పేస్ జంట | Leander Paes, Raven Klaasen end runners-up at Delray Beach | Sakshi
Sakshi News home page

రన్నరప్ పేస్ జంట

Published Tue, Feb 24 2015 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

రన్నరప్ పేస్ జంట

రన్నరప్ పేస్ జంట

డెల్‌రే బీచ్ (అమెరికా): ఈ సీజన్‌లో రెండో డబుల్స్ టైటిల్‌ను సాధించాలనుకున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశ ఎదురైంది. డెల్‌రే బీచ్ ఓపెన్‌లో పేస్-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట రన్నరప్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన డబుల్స్ ఫైనల్లో పేస్-క్లాసెన్ ద్వయం 3-6, 6-3, 6-10తో ప్రపంచ నంబర్‌వన్ జంట బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. బ్రయాన్ బ్రదర్స్‌కిది 104వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement