సెర్బియాతో డేవిస్ కప్
న్యూఢిల్లీ: వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ సెర్బియాతో జరిగే డేవిస్ కప్ పోరులో బరిలోకి దిగనున్నాడు. డబుల్స్‌లో తను రోహన్ బోపన్నతో ఆడనున్నట్టు నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ తెలిపారు. 41 ఏళ్ల పేస్ రాకతో... ఇంతకు ముందు ఎంపికైన యువ ఆటగాడు సాకేత్ మైనేని పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.
జొకోవిచ్ రాకపై ఉత్కంఠ
భారత్‌తో జరిగే డేవిస్‌కప్ పోరులో సెర్బియాకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆడతాడా? లేదా? అనేది నేడు (సోమవారం) తేలనుంది. ఆదివారమే జొకొవిచ్‌తో మాట్లాడాల్సి ఉన్నా యూఎస్ ఓపెన్‌లో తను ఓడిపోవడంతో వెనక్కి తగ్గిన సెర్బియా కెప్టెన్ ఒబ్రడోవిక్... అతడి రాకపై ఏ విషయమూ సోమవారం చెబుతానన్నారు.
బోపన్నతో జతగా పేస్
Published Mon, Sep 8 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement