టి20 వరల్డ్ కప్ కమిటీలో ఎంవి శ్రీధర్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నిర్వహించనున్న టి20 ప్రపంచకప్ లో తెలుగు వ్యక్తికి కీలక పదవి దక్కింది. క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ గా ఎంవి శ్రీధర్ నియమితులయ్యారు. టి20 ప్రపంచకప్ కు ఆర్గనైజింగ్ కమిటీని బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ ను భద్రత, అవినీతి నిరోధక విభాగం(ఏసీఎస్ యూ) ముఖ్య సలహాదారుగా నియమించింది.
ఆర్గనైజింగ్ కమిటీలోని ఇతర సభ్యులు
అమృత మాథుర్: ప్రిన్సిపాల్ కోఆర్డినేటర్
ఆర్పీ షా: టోర్నమెంట్ మేనేజర్
కేవీపీ రావు: మేనేజర్(క్రికెట్ ఆపరేషన్స్)
నిశాంత్ జీత్ అరోరా: బీసీసీఐ, టోర్నమెంట్ మీడియా మేనేజర్
మయాంక్ పరీఖ్: మేనేజర్(లాజిస్టిక్ అండ్ హాస్పిటాలిటీ)
ప్రొఫెసర్ రత్నాకర్ శెట్టి: కమిటీ సలహాదారు