ధోని కేసు విచారణ మే 12కు వాయిదా
అనంతపురం: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎదుర్కొంటున్న వివాదస్పద వాణిజ్య ప్రకటన కేసులో కౌంటర్ దాఖలైంది. అనంతపురం జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకుడు వై.శ్యాంసుందర్ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను అనంతపురం నుంచి బెంగళూరు కోర్టుకు తరలించాలని ధోని లాయర్లు కోరగా, అనంతపురం కోర్టులోనే విచారణ జరగాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.
2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. దీంట్లో ధోని చేతుల్లో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్‌ను కూడా ఉంచారు. అయితే ఈ ఫొటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లోనే శ్యాంసుందర్ కోర్టులో కేసు వేశారు.