Lord Vishnu advertisement
-
సుప్రీం కోర్టులో ధోనీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ధోనీపై దాఖలు చేసిన క్రిమినల్ కేసు పిటీషన్‌ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. దీంట్లో ధోని చేతుల్లో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్‌ను కూడా ఉంచారు. ఈ ఫొటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లో అనంతపురం జిల్లా కోర్టులో కేసు వేశారు. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ ఫొటో వివాదంలో ధోనీ ప్రమేయం లేదని కేసును కొట్టివేయాల్సిందిగా అతని తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరిస్తూ.. ధోనీ ఉద్దేశపూర్వకంగా లేదా కించపరచాలనే భావనతో చేయలేదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ధోనీకి ఈ కేసు నుంచి ఉపశమనం లభించడం ఊరట కలిగిస్తోంది. ఐపీఎల్లో పుణె సూపర్‌జెయింట్స్ జట్టు కెప్టెన్సీ నుంచి ధోనీని తొలగించిన సంగతి తెలిసిందే. పైగా తాజా సీజన్లో ధోనీ స్థాయికి తగ్గట్టు బ్యాటింగ్‌లో రాణించలేకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. -
ధోని కేసు విచారణ మే 12కు వాయిదా
అనంతపురం: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎదుర్కొంటున్న వివాదస్పద వాణిజ్య ప్రకటన కేసులో కౌంటర్ దాఖలైంది. అనంతపురం జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకుడు వై.శ్యాంసుందర్ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను అనంతపురం నుంచి బెంగళూరు కోర్టుకు తరలించాలని ధోని లాయర్లు కోరగా, అనంతపురం కోర్టులోనే విచారణ జరగాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది. 2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. దీంట్లో ధోని చేతుల్లో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్‌ను కూడా ఉంచారు. అయితే ఈ ఫొటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లోనే శ్యాంసుందర్ కోర్టులో కేసు వేశారు. -
ధోనికి సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వివాదస్పద ప్రకటన కేసులో అతడిపై అనంతపురం కోర్టు చేపట్టిన విచారణపై స్టే విధించింది. ఈ కేసు విచారణను అనంతపురం నుంచి బెంగళూరు కోర్టుకు తరలించాలని ధోని పెట్టుకున్న విజ్ఞాపనపై అభిప్రాయం తెలపాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్టు కోరింది. 2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. దీంట్లో ధోని చేతుల్లో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్‌ను కూడా ఉంచారు. అయితే ఈ ఫొటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లోనే అనంతపురం జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకుడు వై.శ్యాంసుందర్ కోర్టులో కేసు వేశారు. తమ ఎదుట హాజరుకావాలని అనంతపురం కోర్టు సమన్లు జారీ చేసింది. ధోని స్పందించకపోవడంతో ఫిబ్రవరి 25లోపు కచ్చితంగా కోర్టులో హాజరు కావాలని, లేకుంటే అరెస్టు తప్పదని ఇటీవల హెచ్చరించింది. -
ధోనికి సుప్రీంకోర్టులో ఊరట