ధోనికి సుప్రీంకోర్టులో ఊరట | Supreme Court stays criminal proceedings against MS Dhoni | Sakshi
Sakshi News home page

ధోనికి సుప్రీంకోర్టులో ఊరట

Published Fri, Jan 29 2016 11:43 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ధోనికి సుప్రీంకోర్టులో ఊరట - Sakshi

ధోనికి సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వివాదస్పద ప్రకటన కేసులో అతడిపై అనంతపురం కోర్టు చేపట్టిన విచారణపై స్టే విధించింది. ఈ కేసు విచారణను అనంతపురం నుంచి బెంగళూరు కోర్టుకు తరలించాలని ధోని పెట్టుకున్న విజ్ఞాపనపై అభిప్రాయం తెలపాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్టు కోరింది.

2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. దీంట్లో ధోని చేతుల్లో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్‌ను కూడా ఉంచారు. అయితే ఈ ఫొటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లోనే అనంతపురం జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకుడు వై.శ్యాంసుందర్ కోర్టులో కేసు వేశారు.

తమ ఎదుట హాజరుకావాలని అనంతపురం కోర్టు సమన్లు జారీ చేసింది. ధోని స్పందించకపోవడంతో ఫిబ్రవరి 25లోపు కచ్చితంగా కోర్టులో హాజరు కావాలని, లేకుంటే అరెస్టు తప్పదని ఇటీవల హెచ్చరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement