కపిల్ జట్టు కెప్టెన్‌గా ధోని
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తాను ప్రకటించిన భారత ఆల్‌టైమ్ అత్యుత్తమ వన్డే జట్టుకు ఎం.ఎస్. ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. తాను స్వయంగా సెలక్ట్ చేస్తున్నందున ఈ జట్టులో తనకు చోటు కల్పించలేదన్న కపిల్... 1983లో వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులోని ఒక్క సభ్యుడిని కూడా ఎంపిక చేయకపోవడం విశేషం. ‘నా అభిప్రాయంతో ఎవరైనా విభేదించవచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం ఇదే అత్యుత్తమ భారత వన్డే జట్టు. మేం 1983లో ప్రపంచ కప్ నెగ్గడానికి ఆ రోజు ఆత్మవిశ్వాసమే కారణం. వాస్తవానికి అప్పటి విండీస్ మాకంటే చాలా పటిష్టంగా ఉంది’ అని కపిల్ దేవ్ అభిప్రాయ పడ్డారు. 12 మంది సభ్యుల కపిల్ డ్రీమ్ టీమ్‌లో సచిన్, సెహ్వాగ్‌లతో పాటు మాజీ కెప్టెన్లు అజహరుద్దీన్, గంగూలీలకు కూడా స్థానం లభిం చింది. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ భారత వన్డే చరిత్రలోనే అత్యుత్తమమని కపిల్ ప్రశంసించారు. యువరాజ్, జహీర్ పునరాగమనం చేయడం కష్టమే అయినా అసాధ్యమేమీ కాదని ఆయన అభిప్రాయ పడ్డారు.
కపిల్‌దేవ్ ఆల్‌టైమ్ భారత వన్డే జట్టు: ఎం.ఎస్. ధోని (కెప్టెన్), సచిన్, గంగూలీ, సెహ్వాగ్, అజహరుద్దీన్, యువరాజ్, కోహ్లి, కుంబ్లే, హర్భజన్, శ్రీనాథ్, జహీర్‌ఖాన్, రవీంద్ర జడేజా (12వ ఆటగాడు).