బర్మింగ్హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఇక్కడ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. ఆట ప్రారంభమైన తరువాత న్యూజిలాండ్ 10 ఓవర్ ఆడుతున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఆట నిలిచిపోయే సమయానికి కివీస్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ల్యూక్ రోంచీ(24 బ్యాటింగ్), కెప్టెన్ కేన్ విలియమ్సన్(16 బ్యాటింగ్)లు క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. మార్టిన్ గప్టిల్(26) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు.