గాయంతో మిషెల్ మార్ష్ అవుట్
భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ తదుపరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. భుజం గాయం తిరగబెట్టడంతో అతను ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
మిషెల్ మార్ష్ స్థానంలో మరో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు ఈనెల 16 నుంచి రాంచీలో జరుగుతుంది.