Michelle Marsh
-
మిషెల్ మార్ష్ అవుట్!
దుబాయ్: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులో కీలక ఆటగాడిని కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇదే మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ మొత్తం లీగ్‌కు దూరం కావచ్చని సమాచారం. సన్‌రైజర్స్ దీనిని అధికారికంగా ప్రకటించకపోయినా... అతని చీలమండ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలిసింది. తన బౌలింగ్‌లో రెండో బంతికి ఫించ్ షాట్‌ను ఆపబోయి గాయపడిన మార్ష్ మరో రెండు బంతులు మాత్రమే వేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత కుంటుకుంటూనే బ్యాటింగ్‌కు వచ్చి తొలి బంతికే అవుటయ్యాడు. అతను ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని, మరో మ్యాచ్ కూడా ఆడటం కష్టమేనని రైజర్స్ వర్గాలు వెల్లడించాయి. అతని స్థానంలో మరో ఆసీస్ ఆల్‌రౌండర్ డానియెల్ క్రిస్టియాన్ పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు కేన్ విలియమ్సన్ కూడా తొడ గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతడు తొలి మ్యాచ్‌కు దూరం కావాల్సి వచ్చింది. విలియమ్సన్ ఎప్పటివరకు కోలుకుంటాడనే విషయంలో ఎలాంటి సమాచారం లేదు. -
స్మిత్ అజేయ ద్విశతకం
పెర్త్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు హవా కొనసాగిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 203/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రోజంతా బ్యాటింగ్ చేసి కేవలం ఒక్క వికెటే కోల్పోయి 346 పరుగులు చేయడంతో... జట్టు స్కోరు 549/4 కు చేరింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (390 బంతుల్లో 229 బ్యాటింగ్; 28 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ (234 బంతుల్లో 181 బ్యాటింగ్; 29 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 301 పరుగులు జతచేశారు. ఇంగ్లండ్‌పై పెర్త్‌లో ఆస్ట్రేలియాకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. మూడో రోజు పడిన ఏకైక వికెట్ షాన్ మార్ష్ (28)ను మొయిన్ అలీ అవుట్ చేశాడు. 92 పరుగుల వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 138 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్లో స్మిత్‌కు ఇది 22వ సెంచరీ. 58వ టెస్టు ఆడుతున్న స్మిత్ 107వ ఇన్నింగ్స్‌లో ఈ మార్క్‌ను చేరుకున్నాడు. గతంలో... బ్రాడ్‌మన్ (58 ఇన్నింగ్స్‌లు), గావస్కర్ (101 ఇన్నింగ్స్‌లు) మాత్రమే అతనికన్నా వేగంగా ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 146 ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 403 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. -
గాయంతో మిషెల్ మార్ష్ అవుట్
భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ తదుపరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. భుజం గాయం తిరగబెట్టడంతో అతను ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మిషెల్ మార్ష్ స్థానంలో మరో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు ఈనెల 16 నుంచి రాంచీలో జరుగుతుంది. -
పిచ్ ఎవరి వైపు..?
-
పిచ్ ఎవరి వైపు..?
► బెంగళూరు వికెట్‌పై తీవ్ర చర్చ ►రెండు రోజుల ముందు పచ్చిక తొలగింపు ► బ్యాటింగ్‌పైనే భారత్ దృష్టి బెంగళూరు: భారత గడ్డపై టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆటకు ముందే పిచ్ ఎలా ఉండబోతోందో అనే చర్చ మరో సారి మొదలైంది. అయితే ఈ సారి సీన్ కాస్త రివర్స్‌గా ఉంది. ఎప్పుడైనా ప్రత్యర్థి జట్లు పిచ్ గురించి ఆందోళన చెందేవి. భారత్‌కు మాత్రం అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. కానీ పుణే టెస్టు మ్యాచ్ దెబ్బకు టీమిండియా కూడా వికెట్‌పై దృష్టి పెడుతోంది. ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ 4–0తో గెలిచినా పిచ్‌ల ఏర్పాటు విషయంలో ఎలాంటి వివాదం రేకెత్తలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పిచ్ ఎవరికి అనుకూలిస్తుందనేది ఆసక్తికరం. శనివారం ప్రారంభం కానున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టుకు మూడు రోజుల ముందు ప్రధాన వికెట్‌పై చాలా ఎక్కువగా పచ్చిక కనిపించింది. అదే సమయంలో ఒక ఎండ్‌లో ఆఫ్ స్టంప్‌కు చేరువలో (ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు) వికెట్ కాస్త ఎత్తుపల్లాలతో ఉంది. ఇది భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు అనుకూలంగా మారవచ్చని భావిస్తున్నారు. అయితే మరో వైపు అదనపు పేస్‌తో ఇది ఆసీస్ స్టార్ మిషెల్ స్టార్క్‌కు కూడా కలిసి వచ్చే ప్రమాదం కనిపించింది. దాంతో గురువారంనాటికి పిచ్ మారిపోయింది. పిచ్‌పైనున్న పచ్చికను దాదాపు పూర్తిగా తొలగించేశారు. ఇప్పుడు ఇది సాధారణ ఉపఖండపు వికెట్లా కనిపించడం విశేషం. అంటే తొలి రెండు రోజుల్లో బ్యాటిం గ్‌కు బాగా అనుకూలించి ఆ తర్వాత మెల్లగా స్పిన్‌కు సహకరించవచ్చు. ఈ సీజన్లో భారత జట్టు ఇంగ్లండ్‌తో ఆడిన ఐదు టెస్టులు, బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో ఇలాంటి పిచ్‌లపైనే ముందుగా భారీ స్కోరు సాధించి ఆ తర్వాత ప్రత్యర్థిని చుట్టేసింది. ఈ ఆరు టెస్టుల తొలి ఇన్నింగ్స్‌లలో భారత్ వరుసగా 488, 455, 417, 631, 759/7, 687/6 పరుగులు చేయడం విశేషం. కాబట్టి ఈ సారి కూడా టాస్ కీలకం కానుంది. పూర్తి స్పిన్ పిచ్ లేదా పేస్ వికెట్ ఉపయోగించి సాహసం చేసే పరిస్థితిలో భారత్ ప్రస్తుతం లేదు. కాబట్టి ముందుగా తమ బలమైన బ్యాటింగ్‌నే నమ్ముకోవాలని జట్టు భావిస్తున్నట్లుంది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు గనుక చేయగలిగితే జట్టుకు టెస్టుపై పట్టు చిక్కవచ్చు. స్టార్క్ మా బలం: మార్ష్ భారత గడ్డపై స్టార్క్‌లాంటి పేస్ బౌలర్ ప్రభావం చూపించడం మంచి పరిణామమని అతని సహచరుడు, ఆసీస్ ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ అభిప్రాయ పడ్డాడు. భారత ఆటగాళ్లలో ఒక రకమైన ఆందోళనను స్టార్క్ పెంచాడని అతను అన్నాడు. ‘స్టార్క్ ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. స్పిన్నర్ల గురించి చర్చ జరిగే భారత్‌లో స్టార్క్ మా ప్రధాన ఆయుధం. భారత బ్యాట్స్‌మెన్‌లో భయం పుట్టించి అతను మరిన్ని వికెట్లు తీస్తాడని నమ్ముతున్నా. స్టార్క్‌తో పాటుహాజల్‌వుడ్ రివర్స్ స్వింగ్ కలిస్తే మాకు తిరుగుండదు’ అని మార్ష్ విశ్వాసం వ్యక్తం చేశాడు. గురువారం భారత జట్టుకు ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో ప్రధాన ఆటగాళ్లంతా సెషన్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మాత్రం పూర్తిస్థాయిలో సాధన చేసింది.