
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్ సంచలన బ్యాటింగ్‌తో సెంచరీ సాధించాడు. 87 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో కెరీర్‌లో 5వ శతకం పూర్తిచేసుకున్నాడు. వచ్చిరావడంతోనే దాటిగా ఆడిన ఈ అఫ్గాన్ ఓపెనర్ ఫోర్లు, సిక్సర్లతో భారత యువ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అయితే కౌల్ వేసిన 8వ ఓవర్లో అంబటి రాయుడు క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది.
అనంతరం భారత స్పిన్నర్ల దాటికి అఫ్గాన్ 17 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయినా చెక్కుచెదరని షెజాద్ తన దూకుడు కొనసాగించాడు. 90 పరుగులనంతరం కొంత నెమ్మదిగా ఆడిన ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్‌పై సెంచరీ సాధించిన తొలి అఫ్గాన్ బ్యాట్స్‌మన్‌గా షెజాద్ గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment